vijay devarakonda: కేరళ వరద బాధితులకు విరాళం ప్రకటించిన 'గీత గోవిందం' నిర్మాత

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా రూపొందిన 'గీత గోవిందం' సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా కేరళలోను భారీస్థాయిలో విడుదలైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కేరళ ప్రాంతమంతా అస్తవ్యస్తమైపోయింది. ఈ వర్షాల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.

దాంతో కేరళ వాసులను ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించడానికిగాను ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు. సినిమా పరిశ్రమకి సంబంధించిన చాలామంది పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'గీత గోవిందం' నిర్మాత బన్నీవాసు కూడా వరద బాధితులకు విరాళం ప్రకటించాడు. కేరళలో 'గీత గోవిందం' ఎంత షేర్ ను రాబడుతుందో అంతమొత్తాన్ని ఆయన విరాళంగా అందజేయనున్నట్టు చెప్పారు.  
Go Back to Shorts
vijay devarakonda
rashmika

More Telugu News