తమ పెళ్లికి వచ్చే గెస్ట్ లకు షరతు విధించిన దీపికా పదుకునే, రణవీర్ సింగ్!
- ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్
- నవంబర్ 20న వివాహ వేడుక
- కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక
ఆ పత్రిక కథనం ప్రకారం... పెళ్లికి హాజరయ్యే అతిథులకు దీపిక, రణవీర్ లు ఒక షరతు విధించారట. వివాహ వేడుకకు ఎవరూ సెల్ ఫోన్లను తీసుకు రావద్దనేదే ఆ షరతు. వీరిది డెస్టినేషన్ వివాహం కావడంతో... కేవలం కుటుంబసభ్యులు, కొంత మంది సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారట. వీరి సంఖ్య 30 వరకు ఉంటుందట. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.