Mahesh Babu: 'గీత గోవిందం' బాగుంది .. ఎంజాయ్ చేశాను: మహేశ్ బాబు

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా రూపొందిన 'గీత గోవిందం' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రొమాంటిక్ కామెడీ కంటెంట్ తో యూత్ కి కనెక్ట్ అయింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన వాళ్లంతా విజయ్ దేవరకొండ .. రష్మిక మందన మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అంటున్నారు.ఇక ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు స్పందిస్తూ .. 'గీత గోవిందం' చూశాను .. చాలా ఎంజాయ్ చేశాను. విజయ్ దేవరకొండ .. రష్మిక నటన ఆకట్టుకునేలా వుంది. వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుంది. 'గీత గోవిందం' టోటల్ టీమ్ కి కంగ్రాట్స్' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి .. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ సినిమా చాలా బాగుందంటూ టీమ్ ను అభినందించారు.    
Go Back to Shorts
Mahesh Babu

More Telugu News