పెళ్లికూతురు అవుతోన్న 'కలర్స్' స్వాతి .. వరుడు పైలెట్!
- 'కలర్స్' కార్యక్రమంతో మంచి పేరు
- కథానాయికగాను యూత్ లో క్రేజ్
- ఈ మధ్యనే తగ్గిన అవకాశాలు
ఈ మధ్యనే ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లికి సిద్ధమైందనేది తాజా సమాచారం. పెద్దల అంగీకారంతో ఆమె 'వికాస్' ను ఈ నెల 30వ తేదీన వివాహమాడనున్నట్టు తెలుస్తోంది. వికాస్ తో కొంతకాలంగా వున్న స్నేహం ప్రేమగా మారడం .. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిపోయాయని అంటున్నారు. మలేసియన్ ఎయిర్ లైన్స్ లో వికాస్ పెలైట్ అని చెబుతున్నారు. వివాహం హైదరాబాద్ లో .. రిసెప్షన్ కేరళలో జరగనున్నాయని అంటున్నారు.