మణిరత్నం సినిమాలో హీరోలంతా అన్నదమ్ములే!

  • తమిళంలో 'చక్క చివంత వానం'
  • తెలుగు టైటిల్ గా 'నవాబు'
  • సెప్టెంబర్ 28వ తేదీన విడుదల  
మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో 'చక్క చివంత వానం' సినిమా రూపొందుతోంది. తెలుగులో ఈ సినిమాకి 'నవాబు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అరవింద్ స్వామి .. శింబు .. విజయ్ సేతుపతి .. అరుణ్ విజయ్ .. జ్యోతిక .. అదితీ రావు .. ఐశ్వర్య రాజేశ్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలోని హీరోలంతా అన్నదమ్ములుగా కనిపించనున్నారు.

రాజకీయనాయకుడిగా అరవింద్ స్వామి .. ఇంజనీర్ గా శింబు .. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి కనిపిస్తారట. ఈ పాత్రల మధ్య చోటుచేసుకునే సంఘర్షణ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. బలమైన కథాకథనాలతో .. బంధాలు అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుందని అంటున్నారు. ప్రతి పాత్రను మణిరత్నం అద్భుతంగా తీర్చిదిద్దారనేది యూనిట్ సభ్యులమాట. ఈ నెలలో టీజర్ ను .. వచ్చే నెల ఆరంభంలో ట్రైలర్ ను రిలీజ్ చేసి, వచ్చే నెల 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.     
Go Back to Shorts
aravindswami
shimbu
arun vijay
vijay sethupathi

More Telugu News