'అత్తారింటికి దారేది' విషయంలో అదే జరిగింది: పరుచూరి గోపాలకృష్ణ
- బ్రహ్మానందం పాత్ర పొగరుగా ఉంటుంది
- ఆయనకి హీరో బుద్ధి చెప్పాలనుకుంటాడు
- అందులో భాగంగానే 'అహల్య' ఎపిసోడ్ వస్తుంది
ఇక 'అత్తారింటికి దారేది' విషయానికే వస్తే, ఈ సినిమాలో .. థియేటర్లోని వాళ్లంతా ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసింది బ్రహ్మానందం గారి 'అహల్య' ఎపిసోడ్. అదే ఎపిసోడ్ లో ఆర్టిస్టులు మారుతూ అదే పనిగా నవ్విస్తూ వుంటారు. అది వాంటెడ్ లెంగ్త్ సీన్ కాదు అనిపిస్తుంది కానీ .. వాంటెడ్ లెంగ్తే. ఎందుకంటే .. బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు చూడండి .. డబ్బులు విసురుతూ చాలా పొగరుగా ప్రవర్తిస్తాడు. అత్తమీద ఉన్నటువంటి గౌరవంతో హీరో .. బ్రహ్మానందానికి బుద్ధి చెప్పాలనుకుంటాడు. అందులో భాగమైన 'అహల్య' ఎపిసోడ్ ఆటోమేటిగ్గా వాంటెడ్ లెంగ్త్ అయింది. అందువల్లనే ప్రేక్షకులంతా ఎంజాయ్ చేశారు" అని చెప్పుకొచ్చారు.