మహేశ్ కి బర్త్ డే విషెష్ చెప్పిన స్టార్ హీరో .. హీరోయిన్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ కి బర్త్ డే విషెష్ చెప్పిన స్టార్ హీరో .. హీరోయిన్లు

  • హాండ్సమ్ హీరోగా మహేశ్ కి క్రేజ్
  • ఈ రోజు మహేశ్ బాబు పుట్టినరోజు
  • ఆయన తాజా చిత్రంగా 'మహర్షి'
తెలుగు తెరపై హాండ్సమ్ హీరోగా మహేశ్ బాబుకి మంచి క్రేజ్ వుంది. కెరియర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలకి ప్రాధాన్యతనిస్తూ .. స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అప్పుడప్పుడు పరాజయాలు ఎదురైనా నిరాశ పడకుండా, ఆ వెంటనే భారీ విజయాన్ని అభిమానుల ముందుంచుతూ వాళ్లని ఉత్సాహపరుస్తున్నాడు. అలాంటి మహేశ్ బాబు పుట్టినరోజు ఈ రోజు.

ఈ సందర్భంగా ఆయనకి ఎన్టీఆర్  .. సమంత .. రకుల్ .. ఈషా రెబ్బా .. రామ్ .. మంచు మనోజ్ .. సుధీర్ బాబు .. సుమంత్ .. సీనియర్ నరేశ్ .. అల్లరి నరేశ్ .. అడివి శేష్ .. దేవిశ్రీ ప్రసాద్ .. దర్శకులు వంశీ పైడిపల్లి .. కొరటాల ..  శ్రీను వైట్ల .. అనిల్ రావిపూడి .. సందీప్ రెడ్డి వంగా .. హరీశ్ శంకర్ .. సంపత్ నంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజున మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన తాజా చిత్రమైన 'మహర్షి' నుంచి ఫస్టులుక్ ను .. టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.    
Mahesh Babu

More Telugu News