కమల్ కాదంటే ఆ హీరోలతో కానిచ్చేస్తారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమల్ కాదంటే ఆ హీరోలతో కానిచ్చేస్తారట!

  • 'భారతీయుడు' సీక్వెల్ కి సన్నాహాలు
  • ఆలోచనలో పడిన కమల్ 
  • తెరపైకి విక్రమ్ .. అర్జున్ పేర్లు    
దర్శకుడు శంకర్ ప్రస్తుతం '2.ఓ' సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వున్న రజనీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తరువాత 'భారతీయుడు 2' చేయడానికి శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. '2.ఓ' సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు. ఆ తరువాత లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో 'భారతీయుడు 2' షూటింగ్ మొదలుకానుంది.

అయితే ఈ సినిమా షూటింగుపై దృష్టిపెడితే, రాజకీయపరమైన తన పనులకు ఇబ్బంది కలుగుతుందని కమలహాసన్ భావిస్తున్నారట. ఈ ఉద్దేశం కారణంగానే ఆయన ఈ ప్రాజెక్టుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. రాజకీయ పరమైన కారణాల వలన ఈ ప్రాజెక్టు చేయడం కుదరదని కమల్ అంటే, విక్రమ్ తో గానీ .. అర్జున్ తో గాని చేయాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నట్టుగా సమాచారం. ఒక కీలకమైన పాత్రలో అజయ్ దేవగణ్ కనిపించనున్నాడని అంటున్నారు. గతంలో విక్రమ్ తోను .. అర్జున్ తోను శంకర్ భారీ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.             
kamal
shankar

More Telugu News