విజయవాడలో 100 మంది రైతులు, వైఎస్సార్ సీపీ నేతల అరెస్ట్!

  • ఎస్ఈని కలిసేందుకు బయలుదేరిన రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు
  • మార్గమధ్యంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు
  • ప్రభుత్వంపై మండిపడ్డ రమేశ్, పార్థసారధి
రైతుల పంటలకు సాగునీరు అందించాలని వినతిపత్రం ఇచ్చేందుకు విజయవాడ ఎస్ఈ కార్యాలయానికి బయలుదేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని, రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు జోగి రమేశ్, పార్థసారధితో పాటు 100 మంది రైతుల్ని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎస్ఈ కార్యాలయం లోపలకు వెళ్లకుండా వీరిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. నీళ్లివ్వమని ఎస్ఈకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న తమను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జిల్లాలో లక్షలాది ఎకరాల్లోని పంట నీళ్లు లేక ఎండపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల వ్యతిరేక, రైతన్నలను నాశనం చేసే ప్రభుత్వం ఉందని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
YSRCP
Vijayawada
Police

More Telugu News