Karnataka: కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లే బస్సుల రద్దు!

షార్ట్స్‌లో చూడండి
కరుణానిధి మరణవార్త అనంతరం తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం రద్దు చేసింది. అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక జిల్లాల ఎస్పీలను సీఎం కుమారస్వామి ప్రభుత్వం ఆదేశించింది. కాగా, తమిళనాడులో రేపు సెలవు దినంగా, వారంరోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు, రేపు తమిళనాడులో సినిమాల ప్రదర్శనలు నిలిపివేశారు. తమిళనాడు వ్యాప్తంగా ఫోన్ ఔట్ గోయింగ్ కాల్స్ నిలిపివేసినట్టు సమాచారం. 
Go Back to Shorts
Karnataka
Tamilnadu

More Telugu News