చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లిపోయింది: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లిపోయింది: రోజా

  • ఆసుపత్రిలో చేర్పించి, ట్రీట్ మెంట్ ఇవ్వాలి
  • ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్నారు
  • 250 కోట్ల అవినీతి సొమ్ముతో హైదరాబాదులో ఇల్లు కట్టారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లిపోయిందని... అందుకే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకోలేదని చంద్రబాబు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని అసెంబ్లీలో తీర్మానం చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల జగన్ పోరాటం, వైసీపీ ఎంపీల రాజీనామాల తర్వాత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు.

జగన్ పై అక్రమాస్తుల కేసులు మాత్రమే ఉన్నాయని, అసలు అక్రమాస్తులన్నీ చంద్రబాబు వద్దే ఉన్నాయని రోజా అన్నారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆస్తులను ప్రధాని మోదీ ఎందుకు జప్తు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాదులో రూ. 250 కోట్లతో చంద్రబాబు ఇల్లు కట్టారని... ఆ ఇంటికి ఒక్క టీడీపీ నేతను కూడా ఎందుకు ఆహ్వానించలేదని అడిగారు. అవినీతి సొమ్ముతో కట్టిన ఇల్లు కాబట్టే... ఎవరినీ ఆహ్వానించలేదని ఎద్దేవా చేశారు. 
Chandrababu
roja
jagan
modi

More Telugu News