క్యాస్టింగ్ కౌచ్ పై నిహారిక స్పందన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్యాస్టింగ్ కౌచ్ పై నిహారిక స్పందన!

  • క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉంది
  • నీవు ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుంది
  • నీ ప్రమేయం లేకుండా జరిగితే.. అది రేప్ అవుతుంది
సినీ పరిశ్రమను క్యాస్టింగ్ కౌచ్ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా మెగా డాటర్ నిహారిక దీనిపై స్పందించింది.

క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ పరిశ్రమలో మాత్రమే ఉందని చెప్పడం తప్పని నిహారిక అభిప్రాయపడింది. ప్రతి రంగంలో కూడా ఇలాంటివి ఉన్నాయని... తాను చాలా ఘటనల గురించి విన్నానని చెప్పింది. ఎవరైనా ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుందని తెలిపింది. నీ ప్రమేయం లేకుండా జరిగితే అది రేప్ కిందకు వస్తుందని చెప్పింది.

ఏదైనా జరిగిపోయాక వాళ్లు అది చేశారు... వీళ్లు ఇది చేశారు అని చెప్పడం మంచిది కాదని అంది. నాకు ఇది తప్ప మరో దారి లేదు అనుకుంటేనే దానికి సిద్ధపడాలని తెలిపింది. తాను వాళ్ల స్థానంలో ఉండి మాట్లాడలేనని... ఎందుకంటే తన బ్యాక్ గ్రౌండ్ వేరని చెప్పింది. బయట నుంచి వచ్చిన అమ్మాయిలా తాను మాట్లాడలేనని తెలిపింది. 
niharika
Casting Couch

More Telugu News