ఈ ఏడాదే రణ్ వీర్ - దీపిక వివాహం.. ధ్రువీకరించిన సన్నిహిత వర్గాలు
- ఈ ఏడాది చివర్లో ఇటలీలో పెళ్లి వేడుకలు
- ధ్రువీకరించిన సన్నిహిత వర్గాలు
- లేక్ కోమో లోని విల్లాడెల్ బాల్బియనెల్లో లో పెళ్లి జరిగే అవకాశం
యూరప్ లో ప్రకృతి అందాలకు నెలవైన ఇటలీలో తమ వివాహ వేడుకను నిర్వహించాలని దీపిక-రణ్ వీర్ కోరుకుంటున్నారట. ఇటలీలోని లేక్ కోమో ప్రాంతాన్ని ఇందుకోసం ఎంచుకునే అవకాశముందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక్కడి విల్లాడెల్ బాల్బియనెల్లోలో గతంలో పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు, క్రీడాకారుల వివాహాలు జరిగాయి. విరాట్, అనుష్క జంట ఇటలీలోని టుస్కనీలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.