రాజమౌళి చాలెంజ్ ని పూర్తిచేసి.. మహేష్ బాబుకు చాలెంజ్ విసిరిన కేటీఆర్!
- కవిత విసిరిన 'హరితహారం' చాలెంజ్ పూర్తి చేసిన రాజమౌళి
- దాన్ని కేటీఆర్ కు ఫార్వార్డ్ చేయడంతో మొక్కలు నాటిన కేటీఆర్
- మహేష్, సచిన్, లక్ష్మణ్ లను ట్యాగ్ చేసిన కేటీఆర్
తాను నిమ్మ తదితర చెట్లను నాటానని చెబుతూ, పుల్లెల గోపీచంద్, కేటీఆర్, వంగా సందీప్, నాగ్ అశ్విన్ లను రాజమౌళి ట్యాగ్ చేశారు. రాజమౌళి సవాల్ ను స్వీకరించిన కేటీఆర్, నిన్న రోజ్ ఉడ్, గోల్డెన్ చంపా మొక్కలను నాటి, మహేష్ బాబు, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాజ్ దీప్ సర్ దేశాయ్ లకు సవాల్ ను ఫార్వార్డ్ చేసి, ఒక్కొక్కరూ కనీసం మూడు మొక్కలు నాటి చూపాలని కోరారు. ఇక కేటీఆర్ చాలెంజ్ పై వీరంతా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.