శరవేగంగా సిద్ధమవుతున్న ప్రిన్స్ మహేష్ బాబు మైనపు బొమ్మ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శరవేగంగా సిద్ధమవుతున్న ప్రిన్స్ మహేష్ బాబు మైనపు బొమ్మ!

  • మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మహేష్ మైనపు బొమ్మ
  • టాలీవుడ్ లో ఆ చాన్స్ దక్కించుకున్న రెండో హీరో
  • మ్యూజియం ప్రతినిధులకు మహేష్ కృతజ్ఞతలు
మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో కొలువు దీరనున్న ప్రముఖుల జాబితాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా చేరిపోయాడు. 'రాజకుమారుడు'గా తెలుగు చిత్ర సీమలో హీరోగా కెరీర్ మొదలుపెట్టి సూపర్ స్టార్‌ గా, తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్న మహేశ్ బాబుకు ఈ అరుదైన అవకాశం దక్కింది.

తెలుగు హీరోల్లో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు బొమ్మ అవకాశాన్ని దక్కించుకున్న రెండో హీరో మహేష్ బాబు. ఇంతకుముందు 'బాహుబలి'తో తెలుగు సినిమా స్టామినాను చాటిన ప్రభాస్ బొమ్మను మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

 ఇక తన మైనపు బొమ్మ విషయాన్ని మహేశ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. తన వివరాలు సేకరించడానికి వచ్చిన మ్యూజియం ప్రతినిధులకు ఈ సందర్భంగా మహేశ్ కృతజ్ఞతలు తెలుపుతూ, తన బొమ్మ తయారవుతుండగా తీసిన చిత్రాన్ని పంచుకున్నారు.

కాగా, మహేష్ బాబు బొమ్మను ఢిల్లీ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారా? లేక బ్యాంకాక్‌ లో ఏర్పాటు చేస్తున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Madum Tussads
Wax Statue
Mahesh Babu

More Telugu News