విజయ్ దేవరకొండ సింగర్ గానూ దుమ్మురేపేశాడు
Add ap7am to your home Screen

విజయ్ దేవరకొండ సింగర్ గానూ దుమ్మురేపేశాడు

  • విజయ్ దేవరకొండ .. రష్మికల 'గీత గోవిందం'
  • ప్రత్యేక ఆకర్షణగా గోపీసుందర్ సంగీతం 
  • ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు
పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'గీత గోవిందం' సినిమా రూపొందింది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో విజయ్ దేవరకొండ ఒక పాట పాడాడు. రికార్డింగ్ థియేటర్లో విజయ్ దేవరకొండ పాడుతూ వున్నప్పటి వీడియోతో కూడిన లిరికల్ సాంగ్ ను తాజాగా వదిలారు.

"అమెరికా గాళ్ అయినా . . అత్తిలి గాళ్ అయినా .. యూరప్ గాళ్ అయినా .. యానాం గాళ్ అయినా" అంటూ ఈ పాట జోరుగా సాగింది. 'అమ్మాయంటేనే టఫ్ఫు .. వాళ్ల తిక్కకి మనమే స్టఫ్ఫు .. దానికి నేనే ప్రూఫు ..' అంటూ అమ్మాయిల ధోరణిని ప్రస్తావిస్తూ పదాల గారడీతో సాగింది. శ్రీమణి సాహిత్యం .. గోపీసుందర్ సంగీతం యూత్ ను బాగా ఆకట్టుకునేలా వున్నాయి. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 
vijay devarakonda
rashmika

More Telugu News