హైదరాబాద్ పెళ్లి వేడుకలో ‘బెల్లీ డ్యాన్స్’.. అరెస్టులు!
- చాంద్రాయణగుట్టలోని ఓ ఫంక్షన్ హాల్ లో బెల్లీ డ్యాన్స్
- ఈ డ్యాన్స్ కోసం రూ.15 లక్షల ఖర్చు
- నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, పెళ్లి కొడుకు తన దుబాయ్ ఫ్రెండ్స్ కోసం బెల్లీ డ్యాన్స్ ఏర్పాటు చేశారని, శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇది నిర్వహించారని చెప్పారు. డ్యాన్సర్లలో రష్యన్ యువతులు, ముంబై యువతులు ఉన్నారని, వీరంతా అర్ధనగ్నంగా నృత్యాలు చేశారని అన్నారు. బెల్లీ డ్యాన్స్ కోసం యువతులను తీసుకొచ్చిన ఆర్గనైజర్ ను గుర్తించామని, జూబ్లీ హిల్స్ కు చెందిన వెంకట్ ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేశారని చెప్పారు. బెల్లీ డ్యాన్స్ ఏర్పాటు నిమిత్తం పెళ్లికొడుకు రూ.15 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిసిందని అన్నారు. నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.