గతంలో నాన్న దగ్గర డబ్బు లేకపోతే.. ఆయన 5 వేలు ఇచ్చి ఆదుకున్నారు!: రామ్ చరణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గతంలో నాన్న దగ్గర డబ్బు లేకపోతే.. ఆయన 5 వేలు ఇచ్చి ఆదుకున్నారు!: రామ్ చరణ్

  • ఎమ్మెస్ రాజుగారి కోసమే ఈ ఫంక్షన్ కు వచ్చా
  • సినీ పరిశ్రమలో రాణించాలంటే మంచితనం కూడా ఉండాలన్న చరణ్
  • షూటింగ్ లో తనను గాజుబొమ్మలా చూసుకున్నారన్న నిహారిక
'హ్యాపీ వెడ్డింగ్' సినిమా ఆడియో ఫంక్షన్లో హీరో రామ్ చరణ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. నిహారిక కోసం తాను ఈ ఫంక్షన్ కు రాలేదని... ఎమ్మెస్ రాజు గారి కోసం వచ్చానని చెప్పాడు. 'గతంలో ఒకసారి ఇంట్లో డబ్బు లేకపోతే నాన్న చాలా మందిని అడిగారట... ఎవరూ సహాయం చేయకపోతే, ఎమ్మెస్ రాజుగారు రూ. 5 వేలు ఇచ్చి ఆదుకున్నారట... ఈమధ్యనే నాన్న ఈ విషయాన్ని మా వద్ద గుర్తు చేసుకున్నారు' అని తెలిపాడు చరణ్. అలాంటి ఎమ్మెస్ రాజు గారు ఫంక్షన్ కి రమ్మని అడిగితే, రెండో విషయం ఆలోచించకుండా వచ్చేశానని చెప్పాడు. సినీ పరిశ్రమలో రాణించాలంటే మంచితనం కూడా ఉండాలని తెలిపాడు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి నిహారికను చూస్తున్నామని, ఈ సినిమా పోస్టర్ లో నిహారికను చూస్తుంటే విచిత్రమైన అనుభూతి కలుగుతోందని చెప్పారు. సెట్లో యూనిట్ అంతా తనను గాజు బొమ్మలా చూసుకున్నారని నిహారిక తెలిపింది. అమ్మాయి మనసులోని ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించారని చెప్పింది. షూటింగ్ లో నిజంగానే పెళ్లి వాతావరణం కనిపించిందని తెలిపింది. ఈ సినిమాలో నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. 
ramcharan
niharika
happy wedding

More Telugu News