Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్ 2' చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ నిన్న ముగిసింది. వెంకటేశ్ పక్కన నటిస్తున్న హీరోయిన్ తమన్నా ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ, 'ఈ సినిమా షూటింగులో సరదాలకు అంతేలేదు. ఈ టీమ్ తో పనిచేయడం చాలా హ్యాపీగా వుంది' అంటూ పేర్కొంది.    
*  అటు సినిమాలతో పాటు, ఇటు కమర్షియల్స్ కూడా ఎక్కువగానే చేసే సూపర్ స్టార్ మహేశ్ బాబు ఖాతాలో తాజాగా మరో బ్రాండ్ చేరింది. ప్రముఖ టూత్ పేస్ట్ 'క్లోజప్' బ్రాండుకు ప్రచారకర్తగా పనిచేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వాణిజ్య ప్రకటన షూటింగును కూడా పూర్తి చేశాడు.
*  తాను నటిస్తున్న 'శ్రీనివాస కల్యాణం' చిత్రం షూటింగ్ పూర్తవడంతో కథానాయిక రాశిఖన్నా హాలిడే తీసుకుంది. ముందుగా యూరప్ లోని నెదర్లాండ్స్ లో పర్యటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. త్వరలోనే తన పర్యటన ముగించుకుని వచ్చి తమిళ చిత్రాల షూటింగులో పాల్గొంటుంది.
Go Back to Shorts
Thamanna
Venkatesh
Rashikhanna

More Telugu News