కల్యాణ్ దేవ్ తో సినిమాపై స్పందించిన హరీశ్ శంకర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కల్యాణ్ దేవ్ తో సినిమాపై స్పందించిన హరీశ్ శంకర్

  • మెగా హీరోలతో చేసిన హరీశ్ శంకర్ 
  • కల్యాణదేవ్ తో నెక్స్ట్ మూవీ అంటూ టాక్ 
  • 'దాగుడుమూతలు' ఇప్పట్లో లేనట్టే      
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా ఇటీవలే 'విజేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ సంగతి అటుంచితే లుక్ పరంగా .. నటన పరంగా కల్యాణ్ దేవ్ కి మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఆయన తదుపరి సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన వినిపించిన కథ నచ్చడంతో మెగా స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు.

గతంలో పవన్ కల్యాణ్ .. అల్లు అర్జున్ .. సాయిధరమ్ తేజ్ లతో హరీశ్ శంకర్ సినిమాలు చేశాడు. అందువలన కల్యాణ్ దేవ్ తో చేయడం కూడా నిజమే కావొచ్చని అనుకున్నారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదనీ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని తాజాగా హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో హరీశ్ చేద్దామనుకున్న 'దాగుడుమూతలు' కూడా ఈ ఏడాది  పట్టాలెక్కడం లేదు .. ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ఏమిటనేది చూడాలి మరి.      
harish shankar

More Telugu News