భారత యుద్ధ నౌకల పేల్చివేతకు పాక్ పన్నాగం... ఉగ్రవాదులకు డీప్ సీ డైవర్ శిక్షణ!
- విశాఖ తీరంలోని నౌకలు, సబ్ మెరైన్లు టార్గెట్
- ఇండియాలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారు
- హెచ్చరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు
- నిఘాను పెంచిన కేంద్రం
సముద్ర అంతర్భాగం గుండా జలాంతర్గాముల వద్దకు చేరి, వాటిని పేల్చే సాంకేతికత గురించి వారికి పూర్తి అవగాహన కూడా ఉందని, ఆధునిక ఆయుధ శిక్షణనూ వారు పూర్తి చేసుకున్నారని ఇంటెలిజెన్స్ సంస్థలను సమన్వయం చేసే మల్టీ ఏజెన్సీ సెంటర్ పేర్కొంది. నౌకాదళంపై దాడి చేయడమే వీరి లక్ష్యమని తెలిపింది. ఈ విషయం తెలిసిన తరువాత అప్రమత్తమైన నేవీ అధికారులు, జలాంతర్గాములు, యుద్ధ నౌకలకు అత్యాధునిక సెన్సార్లను అమర్చారని తెలుస్తోంది. యుద్ధ నౌకలైన ఐఎన్ఎస్ అరిఘాట్, అరిహంట్ లతో పాటు, అణ్వస్త్రాలను మోసుకెళ్లే ఐఎన్ఎస్ చక్ర జలాంతర్గామి కూడా విశాఖ తీరంలో మోహరించి ఉండటంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.