శ్రీరెడ్డి విషయంలో రంగంలోకి దిగుతోన్న విశాల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీరెడ్డి విషయంలో రంగంలోకి దిగుతోన్న విశాల్!

  • తమిళ ఇండస్ట్రీపై శ్రీరెడ్డి ఆరోపణలు
  • సమాధానం చెప్పాలన్న టి.రాజేందర్
  • పరిష్కారం దిశగా విశాల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కాస్టింగ్ కౌచ్ ప్రస్తావన తెస్తూ .. చాలామంది పేర్లను శ్రీరెడ్డి తెరపైకి తీసుకొచ్చింది. ఇక రీసెంట్ గా ఆమె తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ ఉండటం అక్కడ చర్చలకు దారితీసింది. మురుగదాస్ .. లారెన్స్ .. శ్రీరామ్(శ్రీకాంత్)పై ఆమె ఆరోపణలు చేయడం .. దీని వల్ల విశాల్ వైపు నుంచి తనకు బెదిరింపులు ఉంటాయేమోననే అనుమానాలను ఆమె వ్యక్తం చేయడం గురించే అక్కడ అంతా మాట్లాడుకుంటున్నారు.

ఎవరిపై ఆమె ఆరోపణలు చేసిందో .. వాళ్లు స్పందించాలని టి.రాజేందర్ అనడంతో విషయం మరింత వేడెక్కింది. దాంతో శ్రీరెడ్డి విషయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి రంగంలోకి దిగాలని విశాల్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ఎవరిపై అయితే శ్రీరెడ్డి ఆరోపణలు చేసిందో .. వాళ్లతో మాట్లాడిన తరువాత ప్రెస్ మీట్ పెట్టాలని విశాల్ భావిస్తున్నాడట. ఏదైనా సమస్యపై దృష్టిపెడితే పరిష్కరించేవరకూ విశాల్ వదలడనే పేరుంది. మరి ఈ విషయానికి .. వివాదానికి ఆయన ఎలాంటి ముగింపునిస్తాడో చూడాలి.  
vishal

More Telugu News