నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

  • చెట్టును ఢీకొన్న కారు
  • నుజ్జునుజ్జు అయిన కారు
  • మృతులు మహబూబ్‌నగర్ వాసులుగా గుర్తింపు
నల్గొండ జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పెద్దపూర మండలం పోతునూరు వద్ద ఈ ఘటన జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కారులో చిక్కుకున్న వారిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ముగ్గురిని మహబూబ్‌నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Go Back to Shorts
Road Accident
Nalgonda District
Mahabubabad District

More Telugu News