పాక్ లో ఎన్నికల ర్యాలీలో బాంబు పేలుడు.. 70 మంది మృతి

  • బలూచిస్థాన్ లో బీఏపీ ఎన్నికల ర్యాలీలో సంఘటన
  • బీఏపీ అగ్రనేత సిరాజ్ రైసాని మృతి
  • 70 మంది వరకు మృతి .. 120 మందికి గాయాలు
పాకిస్థాన్ లో నేషనలిస్ట్ బలూచిస్థాన్ ఆవామీ పార్టీ (బీఏపీ) నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ రాష్ట్రంలోని మస్తుంగ్ లో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా శక్తిమంతమైన బాంబు పేలింది. ఈ ప్రమాదంలో బీఏపీ అగ్రనేత నవాబ్ జదా సిరాజ్ రైసాని మృతి చెందారు. ఈ సంఘటనలో సుమారు 70 మంది వరకు మృతి చెందగా, 120 మందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రుల్లో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు బలూచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫయాజ్ కకార్ తెలిపారు. కాగా, బలూచిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి నవాబ్ అస్లామ్ రైసాని సోదరుడు సిరాజ్ రైసాని.
Go Back to Shorts
Pakistan
baluchistan

More Telugu News