RGV: నన్ను అసిస్టెంట్‌గా పెట్టుకోమని నా మాజీ అసిస్టెంట్‌ను కోరుతున్నాను: రామ్ గోపాల్‌ వర్మ

షార్ట్స్‌లో చూడండి
అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RX 100’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. భూపతి.. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయవంతం అయినందుకు గానూ ఆర్జీవీ హర్షం వ్యక్తం చేశారు.

‘నన్ను అసిస్టెంట్‌గా తీసుకోవాలని నా మాజీ అసిస్టెంట్‌ అజయ్‌ భూపతిని కోరుతున్నా’నంటూ ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, ఈ సినిమాలో కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించగా, రాంకీ, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు.  కాగా, ‘RX 100’ సినిమా యూత్‌ని ఆకట్టుకునేలా ఉందని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
Go Back to Shorts
RGV
Tollywood

More Telugu News