సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విజయ్ దేవరకొండ

  • క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు
  • నిర్మాతగా కేఎస్ రామారావు 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు      
విజయ్ దేవరకొండకి యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఒక వైపున కమిటైన సినిమాలను సెట్స్ పైకి తీసుకెళుతూనే, మరో వైపున కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. తాజాగా ఆయన మరో సినిమాకి ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై దర్శకుడు క్రాంతిమాధవ్ గతంలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమా చేశాడు. ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అలాంటి ఈ కాంబినేషన్లోనే మరో ప్రాజెక్టు సిద్ధం కాబోతోంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండను తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనకి సరైన జోడీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు.     
vijay devarakonda

More Telugu News