నా బయోపిక్ లో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుంది: మిథాలీరాజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా బయోపిక్ లో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుంది: మిథాలీరాజ్

  • మా ఇద్దరి వ్యక్తిత్వాలు దాదాపు ఒకేలా ఉంటాయి
  • ఆమె అయితే చక్కగా నటించగలదు
  • టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ వెల్లడి
టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ పై ఓ బయోపిక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో టైటిల్ రోల్ లో కంగనా రనౌత్ లేదా ప్రియాంక చోప్రా నటిస్తారనే వదంతులు హల్ చల్ చేశాయి. చిత్ర నిర్మాతలు మాత్రం ఇందులో టైటిల్ రోల్ ను ఎవరు పోషిస్తున్నారనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.

 ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో తన పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుందనే విషయాన్ని మిథాలీరాజ్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కెరీర్ ఆధారంగా తీయబోతున్న ఈ బయోపిక్ లో తన పాత్రను ప్రియాంక చోప్రా చేస్తే బాగుంటుందని, ఆమె అయితే చక్కగా నటించగలదని అభిప్రాయపడింది. తమ ఇద్దరి వ్యక్తిత్వాలు దాదాపు ఒకేలా ఉంటాయని చెప్పింది. సినీ రంగంపై తనకు అంతగా అవగాహన లేదని చెప్పిన మిథాలీ, నటుల ఎంపిక నిర్ణయాన్ని సినిమా నిర్మాణ సంస్థ ఇష్టానికే వదిలేస్తున్నానని చెప్పడం గమనార్హం.
mithali raj
priyanka chopra

More Telugu News