ND Tiwari: ఎన్డీ తివారీ ఆరోగ్యం అత్యంత విషమం

షార్ట్స్‌లో చూడండి
యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గానూ పనిచేసిన ఎన్డీ తివారీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆయన వయసు 92 సంవత్సరాలు కాగా, గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

కిడ్నీలు పనిచేయక పోవడంతో ఆయనకు డయాలసిస్ నిర్వహిస్తున్నట్టు ఆయన కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ వెల్లడించారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా గత సంవత్సరం సెప్టెంబర్ లో ఆసుపత్రిలో చేరిన తివారీ, అప్పటినుంచి చికిత్స పొందుతూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నట్టు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్ పేర్కొన్నారు. 
Go Back to Shorts
ND Tiwari
Hospital
Dialasis

More Telugu News