ఎన్టీఆర్ గారికి చాలా ఓపిక ఎక్కువ!: నాటి నాయిక కేఆర్ విజయ
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ గారికి చాలా ఓపిక ఎక్కువ!: నాటి నాయిక కేఆర్ విజయ

  • ఎన్టీఆర్ పెద్ద కిరీటాలు పెట్టుకునేవారు 
  • బరువైన ఆభరణాలు ధరించేవారు 
  • ఎంతసేపైనా ఆయన అలాగే ఉండేవారు
అందాల కథానాయికగా అప్పట్లో కేఆర్ విజయకి ఎంతో క్రేజ్ ఉండేది. చక్కని కనుముక్కుతీరు .. సమ్మోహితులను చేసే నవ్వు ఆమె సొంతం కావడం వలన, పౌరాణిక చిత్రాల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చేవి. పౌరాణిక చిత్రాలకి రారాజుగా చెప్పుకునే ఎన్టీఆర్ తోను కలిసి ఆమె చాలా సినిమాల్లో నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

"ఎన్టీఆర్ తో కలిసి నటించాను .. ఆయనకి చాలా ఓపిక ఎక్కువ. షూటింగులో పెద్ద కిరీటం పెట్టుకుని ఎంతసేపైనా ఆయన అలాగే ఉండేవారు .. బరువైన ఆభరణాలను ధరించి అలా కూర్చునే వుండేవారు. షాట్ గ్యాప్ లో నాకు నిద్రవచ్చేసి కునుకు తీసేలోగానే 'విజయ గారూ' అంటూ గట్టిగా పిలిచి .. 'ఇది మీ సీన్' అంటూ బాగా చేయాలనే ఉద్దేశంతో ఉత్సాహపరిచేవారు. ఇక నాగేశ్వరరావు గారితోను చాలా సినిమాల్లో నటించాను. ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.    
kr vijay

More Telugu News