సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’పై జయప్రద స్పందన!
- నాకెప్పుడూ ఆ అనుభవం ఎదురుకాలేదు
- చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను
- నేను నటించిన సినిమాలు అన్నీ విజయవంతమయ్యాయి
- సినీ పరిశ్రమలోకి రావాలనే కోరిక చాలా మంది అమ్మాయిల్లో ఉంది
సినిమాల్లో పాత్రల కోసం తాను ఎవరి వద్దకూ వెళ్లి అడగాల్సిన అవసరమే రాలేదని జయప్రద తెలిపారు. సినీ పరిశ్రమలోకి రావాలనే కోరిక చాలా మంది అమ్మాయిల్లో ఉందని ఆమె తెలిపారు. ముంబయి నుంచి వస్తోన్న చాలా మంది కొత్తమ్మాయిలు అవకాశాల కోసం దర్శక, నిర్మాతల వద్దకు వెళుతున్నారని, దీంతో క్యాస్టింగ్ కౌచ్ గురించి బయటివారికి తెలిసిందని వ్యాఖ్యానించారు.