జల్లికట్టు నేపథ్యంలో సాగే కథ .. కథానాయికగా రాజశేఖర్ కూతురు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జల్లికట్టు నేపథ్యంలో సాగే కథ .. కథానాయికగా రాజశేఖర్ కూతురు

  • శివాని కథానాయికగా '2 స్టేట్స్'
  • తమిళంలో విష్ణు విశాల్ జోడీగా 
  • మలయాళంలో ప్రణవ్ సరసన చేసే ఛాన్స్    
రాజశేఖర్ పెద్ద కూతురు శివాని కథానాయికగా '2 స్టేట్స్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రాజశేఖర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శివాని ఓ తమిళ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో ఒక సినిమాను రూపొందించడానికి దర్శకుడు వెంకటేశ్ సన్నాహాలు చేస్తున్నాడు.

హీరోగా విష్ణువిశాల్ ను ఎంపిక చేసుకున్న ఆయన, హీరోయిన్ పాత్రకి గాను శివానిని సంప్రదించాడట. కథ .. తన పాత్ర నచ్చడంతో వెంటనే శివాని ఓకే చెప్పేసిందట. ఇక మలయాళం నుంచి కూడా శివానికి మంచి ఆఫర్ ఒకటి వచ్చినట్టుగా సమాచారం. మలయాళంలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ హీరోగా ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శివానినే అడుగుతున్నారట. ఇది కూడా దాదాపు ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తుండగానే శివాని బిజీ అయ్యేలా కనిపిస్తోంది కదూ!         
vishnu vishal
shivani

More Telugu News