విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం!
Add ap7am to your home Screen

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం!

  • పూజా కార్యక్రమాలతో 'డియర్ కామ్రేడ్' ప్రారంభం
  • హీరోయిన్ గా రష్మిక మందన
  • తొలి షాట్ కి క్లాప్ కొట్టిన ఎం.ఎం. కీరవాణి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం 'డియర్ కామ్రేడ్' ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి సన్నివేశానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి క్లాప్ కొట్టగా, దర్శకుడు సుకుమార్, కొరటాల శివ స్క్రిప్ట్ అందించారు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కాగా, ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
vijay devarakonda
Tollywood
Hyderabad

More Telugu News