కమలహాసన్ ఇల్లని తెలియకుండా దొంగతనానికి వచ్చిన యువకుడి అరెస్ట్!
- తన ఇంటిని పార్టీ కార్యాలయంగా మార్చిన కమల్
- నిన్న గోడ దూకి ప్రవేశించిన దొంగ
- బంధించి పోలీసులకు అప్పగించిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది
నిన్న ఆ ఇంటి ప్రహరీ గోడ ఎక్కి లోపలకు దూకిన ఓ దొంగను గమనించిన సిబ్బంది, అతన్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని దిట్టకుడి ప్రాంతానికి చెందిన శబరి నాథన్ గా గుర్తించిన పోలీసులు, దొంగతనం కోసమే అక్కడికి వెళ్లాడని తేల్చారు. అయితే, ఆ ఇల్లు కమల హాసన్ దన్న విషయం తనకు తెలియదని శబరి నాథన్ ఇచ్చిన వాగ్మూలంలో వెల్లడించాడట.