పన్నెండేళ్ల నాటి 'పోకిరి' రికార్డును బద్దలు కొట్టిన 'రంగస్థలం'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పన్నెండేళ్ల నాటి 'పోకిరి' రికార్డును బద్దలు కొట్టిన 'రంగస్థలం'!

  • హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో 'పోకిరి' పేరిట అత్యధిక వసూళ్లు
  • ఆ రికార్డును బ్రేక్ చేసిన 'రంగస్థలం'
  • రూ. 1.62 కోట్ల వసూలు
ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన రామ్ చరణ్ చిత్రం 'రంగస్థలం' మరో రికార్డును బద్దలుకొట్టింది. హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం సినిమా హాల్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

గతంలో ఈ రికార్డు మహేష్ బాబు నటించిన 'పోకిరి' పేరిట ఉండగా, దాన్ని 'రంగస్థలం' బ్రేక్ చేసింది. 12 సంవత్సరాల క్రితం విడుదలైన పోకిరి, సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో రూ.1,61,43,081 వసూలు చేసింది. ఇక రంగస్థలం విడుదలైన 89 రోజుల్లో రూ. 1.62 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. కాగా, అప్పటి సినిమా టికెట్ ధరలకు, ఇప్పటి ధరలకు ఎంతో వ్యత్యాసం ఉన్నా రికార్డు రికార్డే కదా!
Pokiri
Rangasthalam
Mahesh Babu
Ramcharan

More Telugu News