చిరూ చిన్నల్లుడి రెండో సినిమా దర్శకుడిగా హరీశ్ శంకర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరూ చిన్నల్లుడి రెండో సినిమా దర్శకుడిగా హరీశ్ శంకర్

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
  • వచ్చేనెల 12న విడుదల 
  • నెక్స్ట్ మూవీ హరీశ్ శంకర్ తో
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా సాయి కొర్రపాటి నిర్మాణంలో 'విజేత' సినిమా రూపొందింది. ఈ సినిమాను వచ్చేనెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, రెండో సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి కల్యాణ్ దేవ్ రెడీ అవుతున్నట్టుగా సమాచారం.

పెద్దగా గ్యాప్ రాకుండా రెండవ సినిమా షూటింగు మొదలు కావాలనే ఆలోచనలో మెగా ఫ్యామిలీ వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. రెండవ సినిమాకి దర్శకుడిగా హరీశ్ శంకర్ ను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ హరీశ్ శంకర్ కి కబురు వెళ్లడం .. ఆయనతో చర్చలు జరగడం పూర్తయ్యాయని అంటున్నారు. కల్యాణ్ దేవ్ కోసం కథ రెడీ చేసే పనిలోనే హరీశ్ వున్నాడని అంటున్నారు. కథతో చిరూను ఎంతవరకూ ఒప్పిస్తాడో చూడాలి మరి. ఇంతకుముందు హరీశ్ శంకర్ 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో బన్నీకి హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.    
kalyan dev
harish shankar

More Telugu News