ramana dikshitulu: నన్ను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి: బ్రాహ్మణ చైతన్య వేదిక కన్వీనర్ సిరిపురపు శ్రీధర్

షార్ట్స్‌లో చూడండి
టీటీడీపై రమణదీక్షితులు, ఏపీ ప్రభుత్వంపై ఐవైఆర్ కృష్ణారావు చేసిన ఆరోపణలను తిప్పికొట్టిన ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక కో కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వెనుక రమణదీక్షితుల హస్తం ఉందంటూ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రమణదీక్షితులు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీధర్ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
ramana dikshitulu
brahmana chaitanya vedika

More Telugu News