vijay devarakonda: విజయ్ దేవరకొండ ఇంట్లో సందడి చేసిన కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు, యంగ్ హీరో విజయ్ దేవరకొండకు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నిన్న సాయంత్రం హైదరాబాదులోని విజయ్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు. తనకు వచ్చిన ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న వారికి అందజేయాలని కేటీఆర్ ను విజయ్ కోరిన సంగతి తెలిసిందే. విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు.

ఈ విషయాన్ని విజయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 'మీకు ఇష్టమైన నాయకుడు మీ ఇంటికి లంచ్ చేయడానికి వస్తే ఎలా ఉంటుంది? ఒక్క సెకను... అసలేం జరుగుతోంది బాసూ. బేసికల్ గా ఏమైనా జరగొచ్చు. మనకు ఇష్టమైన దాన్ని చేసుకుంటూ పోవాల్సిందే. నా ఫిల్మ్ ఫేర్ అవార్డును కేటీఆర్ కు చూపించా. వేలం గురించి చర్చించా. చేనేత, నీటి పరిరక్షణ, హైదరాబాద్ రోడ్లను తవ్వుతుండటం, చరిత్ర, విజయపథంలో ఉండటం, అతని తండ్రి, బాస్, కుమారుడి గురించి మాట్లాడుకున్నాం' అంటూ ట్వీట్ చేశాడు. 
Go Back to Shorts
vijay devarakonda
KTR

More Telugu News