Aamir Khan: బాలీవుడ్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల జాబితాలో 'త్రీ ఇడియట్స్' ఒకటిగా కనిపిస్తుంది. అమీర్ ఖాన్ .. మాధవన్ .. షర్మాన్ జోషి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 2009లో భారీ వసూళ్లతో ఘన విజయాన్ని అందుకుంది. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ముగ్గురి హీరోల కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి రాజ్ కుమార్ హిరాని వచ్చాడట.

ఆల్రెడీ ఆయన స్క్రిప్ట్ కి సంబంధించిన పనులను మొదలుపెట్టినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన 'సంజు' సినిమా విడుదలకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నారు. ఆ తరువాత 'మున్నాభాయ్' 3వ భాగాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇది పూర్తయ్యాక 'త్రీ ఇడియట్స్'కి సీక్వెల్ ను పట్టాలెక్కించనున్నారని అంటున్నారు. మొత్తానికి రాజ్ కుమార్ హిరాని వరుస సీక్వెల్స్ పై దృష్టిపెట్టారన్నమాట.    
Go Back to Shorts
Aamir Khan
madhavan
sharman

More Telugu News