chaitu: చైతూ కోసం రంగంలోకి దిగుతోన్న తమన్నా!

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున కథానాయికగా చేస్తూనే .. మరో వైపున ఐటమ్ సాంగ్స్ చేస్తూ తమన్నా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఒక సినిమాకి ఆమె ఎంత పారితోషికం తీసుకుంటుందో .. ఒక ఐటమ్ సాంగ్ కి కూడా దాదాపు అంతే తీసుకుంటుందనే టాక్ వుంది. ఐటమ్ సాంగ్స్ పరంగా కూడా తమన్నాకి మంచి క్రేజ్ ఉండటం వలన, ఆమెకి భారీ మొత్తం చెల్లించడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు. చైతూ హీరోగా చందూ మొండేటి రూపొందిస్తోన్న 'సవ్యసాచి' సినిమాలోనూ తమన్నా ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించింది. గతంలో నాగార్జున హిట్ కొట్టిన 'అల్లరి అల్లుడు' సినిమాలోని 'నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు' సాంగ్ ను 'సవ్యసాచి' కోసం రీమిక్స్ చేయనున్నారు. చైతూ .. తమన్నాలపై ఈ నెలాఖరులో ఈ పాటను చిత్రీకరిస్తారట. ప్రస్తుతం అందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ .. ఈ పాటతో షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు. జూలై నెలాఖరులో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.   
Go Back to Shorts
chaitu
thamannah

More Telugu News