Chandrababu: చంద్రబాబు ఒక్కరోజైనా కడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడారా?: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఈ నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరోజైనా కడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడారా? అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఈరోజు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... కడప ఉక్కు పరిశ్రమ ఇప్పటికే ప్రారంభం కావాల్సిందని, చంద్రబాబుకు చిత్తశుద్ధి లేని కారణంగానే ఏర్పాటు కాలేదని ఆరోపించారు. టీడీపీ సర్కారు ప్రజలను మోసం చేస్తోందని అన్నారు.

ఏపీలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని, మరోవైపు చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌కు మాత్రం మంత్రి పదవి వచ్చిందని సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, చంద్రబాబు అన్నింట్లోనూ విఫలమయ్యారని అన్నారు. తమ పార్టీ మాత్రమే మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతోందని చెప్పారు. కమీషన్ల కోసమే చంద్రబాబు నాయుడు పోలవరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు.       
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
YV Subba Reddy

More Telugu News