మహానటి గెటప్ లో ఎమ్మెల్యే రోజా.. వైరల్ అవుతున్న ఫొటోలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహానటి గెటప్ లో ఎమ్మెల్యే రోజా.. వైరల్ అవుతున్న ఫొటోలు

  • ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రోజా
  • మహిళల గొప్పదనం గురించి సందేశం
  • చాలా బాగున్నారంటూ అభిమానుల స్పందన
తన సినీ ప్రయాణంలో ఎన్నో విభన్నమైన పాత్రలను పోషించి, మెప్పించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తాజాగా మరో గెటప్ లో ఆమె తళుక్కున మెరిశారు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 'మహానటి' సావిత్రి గెటప్ లో ఆమె చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను అబ్బురపరిచారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఈ సందర్భంగా మహిళల గొప్పదనాన్ని చాటి చెప్పేలా సందేశాత్మకంగా ఓ కామెంట్ పెట్టారు. 'నిజమైన మహిళలు అత్యున్నతంగా, శక్తిమంతంగా, స్వత్రంత్ర భావాలతో, నమ్మకంగా, ప్రేమగా ఉంటారు' అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా బాగున్నారు మేడం అంటూ పలువురు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
roja
ysrcp
mahanati
savitri
tollywood

More Telugu News