vijay devarakonda: విజయ్ దేవరకొండ మూవీలో కొత్తవారికి ఛాన్స్

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'కామ్రేడ్' సినిమా రూపొందనుంది. భరత్ కమ్మా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ సరసన కథానాయికగా రష్మిక మందన కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం కొత్తవారిని తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించారు.

అందుకోసం ఈ నెల 16 .. 17 తేదీలలో కాకినాడలో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. నటన పట్ల ఆసక్తి వున్నవారు ఈ రెండు రోజుల్లో కాకినాడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే వున్న 'గాంధీభవన్' లో జరగనున్న ఆడిషన్స్ కి  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు హాజరుకావలసి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఈ సినిమా యూనిట్ వారు ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రష్మిక మందన క్రికెటర్ గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా మరో మూడు నాలుగు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో విజయ్ దేవరకొండ వున్నాడు.
Go Back to Shorts
vijay devarakonda
rashmika

More Telugu News