రోజాతో అన్నట్టుగానే ఆమెకి నా గోల్డ్ రింగ్ ఇచ్చేశాను!: పరుచూరి గోపాలకృష్ణ
- 'సర్పయాగం'లో రోజాకి ఛాన్స్ ఇచ్చాను
- తను నన్ను డాడీ అని పిలిచేది
- ఆ సినిమా 100 రోజులు ఆడింది
ఆ సినిమా షూటింగ్ సమయంలో రోజా నన్ను 'డాడీ' అని పిలిచేది. అప్పట్లో నా చిటికెన వ్రేలుకి ఒక గోల్డ్ రింగ్ ఉండేది. ఒకసారి రోజా 'డాడీ .. ఈ సినిమా 100 రోజులు ఆడితే నాకు ఈ ఉంగరం ఇచ్చేస్తావా?' అని అడిగింది. 'నీ నోటి మాట వలన నిజంగా 100 రోజులు ఆడితే ఆ ఫంక్షన్లోనే ఇచ్చేస్తానమ్మా' అన్నాను నేను. ఆ సినిమా 100 రోజులు ఆడింది .. ఆ ఫంక్షన్లో 'ఇదిగోనమ్మా నువ్వు అడిగిన ఉంగరం అని చెప్పేసి ఇచ్చేశాను' అని చెప్పుకొచ్చారు.