లాభాల బాటలో దూసుకుపోతోన్న 'అభిమన్యుడు'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లాభాల బాటలో దూసుకుపోతోన్న 'అభిమన్యుడు'

  • విశాల్ హీరోగా తెరకెక్కిన 'అభిమన్యుడు'
  • తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకి పైగా గ్రాస్
  • సమంతకి ఇక్కడ మరో హిట్        
మొదటి నుంచి కూడా విశాల్ తన తమిళ సినిమాలు తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటూ వస్తున్నాడు. అందువలన ఇక్కడ విశాల్ అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే తమిళంలో హిట్ కొట్టిన ఆయన సినిమాలు కొన్ని తెలుగులో అంతగా ఆడలేదు. అందువలన తెలుగులో ఆయన విజయాన్ని అందుకుని చాలాకాలమే అయింది.

అలాంటి విశాల్ ఇటీవల తమిళంలో చేసిన 'ఇరుంబు తిరై' అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో ఈ నెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్ గత చిత్రాలు కొన్ని ఇక్కడ సరిగ్గా ఆడకపోవడం వలన, ఈ సినిమా తెలుగు అనువాద హక్కులను నిర్మాత హరి రెండున్నర కోట్లకే సొంతం చేసుకున్నాడు.

కంటెంట్ లోని కొత్తదనం కారణంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ 10 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. దాదాపు ఏడున్నర కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ఇప్పటికే పెట్టుబడికి మూడు రెట్లు లాభం తెచ్చిపెట్టిన ఈ సినిమా, ప్రస్తుతం లైన్లో  చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడంతో మరిన్ని వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.        
vishal
samanta

More Telugu News