వేరొకరి బైక్పై భార్య.. లారీతో ఢీకొట్టి చంపిన భర్త!
- మరిది వరసైన వ్యక్తి బైక్పై భార్య
- అక్రమ సంబంధం ఉందని అనుమానం
- విజయనగరం జిల్లాలో ఘటన
భర్తను కలిసేందుకు రమణమ్మ, మరిది వరసైన రామకృష్ణతో కలసి బైక్పై సుభద్రాపురం బయలుదేరింది. వారిద్దరినీ చూసిన తవిటయ్యలో అనుమానం మరింతగా పెరిగింది.. అతనిలో ఆగ్రహం ముంచుకొచ్చింది. అంతే, లారీతో వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రమణమ్మ అక్కడికక్కడే చనిపోగా రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.