నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, భార్యలను వదిలేసిన వారికి ఓట్లు పడవు: యరపతినేని సెటైర్
- 16 నెలలు జైల్లో ఉండి వచ్చినంత మాత్రాన ఓట్లు పడవు
- చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉంది
- సీనియర్ అయిన చంద్రబాబును మోదీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు
రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరుగకుండా చంద్రబాబు కష్టపడుతున్నారని, ఎన్నికల్లో అన్ని సీట్లను గెలిపించి ఆయనకు కానుకగా ఇవ్వాలని యరపతినేని కోరారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబే సీనియర్ అని... అందుకే ఆయనను ఇబ్బందులకు గురి చేసేందుకు జగన్ ను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకున్నారని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని తాను సందర్శిస్తానని, అందరి కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చేందుకు యత్నిస్తానని చెప్పారు.