లవ్ లో పడొద్దని హీరో విజయ్ గట్టిగా చెప్పాడు.. నేను వినలేదు!: 'ఖడ్గం' సంగీత
Add ap7am to your home Screen

లవ్ లో పడొద్దని హీరో విజయ్ గట్టిగా చెప్పాడు.. నేను వినలేదు!: 'ఖడ్గం' సంగీత

  • విజయ్ ఫ్యామిలీతో మాకు బాగా పరిచయం 
  • ఆయన సినిమాతోనే నేను ఎంట్రీ ఇవ్వాల్సింది 
  • లవ్ లో పడిన విషయం ఆయనకి చెప్పేశాను  
అందం .. అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన నిన్నటితరం కథానాయికలలో సంగీత ఒకరు. తెలుగులో 'ఖడ్గం' .. 'పెళ్లామ్ ఊరెళితే' .. 'ఈ అబ్బాయి చాలా మంచోడు ' వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆమె ఎంతగానో ఆకట్టుకున్నారు. అలాంటి సంగీత తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు.

"తమిళ స్టార్ హీరో విజయ్ కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో స్నేహం ఉండేది. ఒకరింటికి ఒకరం వచ్చి వెళుతుండేవాళ్లం. విజయ్ సినిమాతోనే తమిళంలో నా ఎంట్రీ జరగాలని మా అమ్మ భావించింది గానీ కుదరలేదు. విజయ్ మాత్రం నా విషయంలో చాలా కేర్ తీసుకునేవాడు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండాలని చాలా గట్టిగా చెప్పేవాడు. కానీ నేను ఓ వ్యక్తి ప్రేమలో పడిపోయాను .. అతణ్ణి తీసుకుని వెళ్లి విజయ్ కి పరిచయం చేశాను. నేను సరైన వ్యక్తిని ఎంచుకున్నానని విజయ్ సంతోష పడ్డాడు. నేను ప్రేమించిన క్రిష్ అసలు పేరు విజయ్ .. హీరో విజయ్ భార్య పేరు సంగీత .. ఇలా అనుకోకుండా జరగడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.       
sangeeta
vijay

More Telugu News