మరో బయోపిక్: వెండితెరకు విజయ్‌ మాల్యా కథ

షార్ట్స్‌లో చూడండి
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది. జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా, లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా జీవిత చరిత్రను సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్ మాల్యా పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద పోషిస్తున్నాడని నిహ్లానీ తెలిపారు. మాల్యా పాత్రలో గోవింద గెటప్ చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారని చెప్పారు. కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై ఓ పాటను గత వారమే షూట్ చేశారు. ఈ సందర్భంగా నిహ్లానీ మాట్లాడుతూ, గతంలో కంటే గోవింద ఇప్పుడు ఫిట్ గా ఉన్నారని కితాబిచ్చారు. బ్యాంక్ స్కాం సన్నివేశాలను వినోదాత్మకంగా తెరకెక్కించామని చెప్పారు. 
Go Back to Shorts
vijay mallya
biopic
bollywood
pankaj nihalani
govinda

More Telugu News