'కార్తికేయ 2' మరింత ఆలస్యం?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కార్తికేయ 2' మరింత ఆలస్యం?

  • గతంలో నిఖిల్ హీరోగా వచ్చిన 'కార్తికేయ'
  • దర్శకుడిగా చందూ మొండేటికి మంచి గుర్తింపు
  • సీక్వెల్ ఆలోచనలో హీరో .. దర్శకుడు     
నిఖిల్ హీరోగా .. చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన 'కార్తికేయ' ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా చివరిలో.. సీక్వెల్ వుంటుందనే హింట్ ఇచ్చి వదిలేశారు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ సీక్వెల్ చేయడానికి ప్రయత్నిస్తూనే వున్నారు. అయితే ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటం వలన కుదరలేదు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తికాగానే, 'కార్తికేయ 2'ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిఖిల్ .. చందూ మొండేటి అనుకున్నారు. వాళ్ల నుంచి ఆ సినిమా సీక్వెల్ రానుందనే అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఇంకాస్త సమయం పట్టేలా వుంది. అందుకు కారణం 'సవ్యసాచి' తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మరో హీరోతో .. మరో కథను చందూ మొండేటి చేయనుండటమే. ఇక నిఖిల్ కూడా మరో దర్శకుడితో .. మరో ప్రాజెక్టుతో ముందుకెళ్లవలసిందే.    
nikhil
chandu

More Telugu News