శంషాబాద్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమ జంట

  • ఎల్కగూడకు చెందిన యువకుడు జోషి
  • చిలుకూరుకు చెందిన యువతి నయోమి 
  • ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న వైనం
ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం ఎల్కగూడకు చెందిన జోషి అనే యువకుడు, చిలుకూరుకు చెందిన నయోమి అనే యువతి కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే, ఏం జరిగిందో ఏమో గానీ, శంషాబాద్‌లోని ఓ ప్రాంతంలో ఇద్దరూ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిద్దరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  
Go Back to Shorts
suicide
attempt
lovers

More Telugu News